నేడు ఏఎంసీ చైర్మన్ గా..ప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం
1 min read
హాజరుకానున్న మంత్రులు బీసీ..ఫరూక్
నందికొట్కూరు, న్యూస్ నేడు : నంద్యాల జిల్లా నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వీరం ప్రసాద్ రెడ్డి ఈరోజు గురువారం మ. 3 గం.కు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమం నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరగనుంది.చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ అలగనూరు సుధాకర్ యాదవ్ మరియు పదిమంది డైరెక్టర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రహదారులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరు కానున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేశారు.వీరం ప్రసాద్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ గా గతనెల ఏప్రిల్ 4వ తేదీన నియమిస్తూ ప్రభుత్వం జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని పార్టీ కార్యాలయం తెలిపింది.