ప్రసాద్ సేవలు అబినందనీయం…
1 min readప్రధానోపాధ్యాయులు హేమలత వెల్లడి
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తుగ్గలి మండలం లోనే రామలింగయ్య పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేసిన ఇంగ్లీషు ఉపాధ్యాయులు నాగేటి ప్రసాద్ సేవలు అభినందనీయమని స్కూల్ ప్రధానో పాద్యాయురాలు హేమలత కొనియాడారు. పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు నాగేటి ప్రసాద్ పదవ తరగతి పిల్లలందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారని ఆమె తెలిపారు. పేదవిద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ ఇప్పించడం ఎంతో అభినందిచ వలసిన అవసరం ఉందని అన్నారు.వారు పేద పిల్లల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని ఆమె అన్నారు.గతంలోఆయన ఎక్కడ పనిచేసినా పిల్లల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే వుంటారని అన్నారు.ఆమె హృదయ పూర్వకoగా ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నాగేటి ప్రసాద్ మాట్లాడుతూ, నేను కూడా ఎన్నో కష్టాలు పడి,ఈ స్థాయికి వచ్చానని,నా దగ్గర చదివే పిల్లలు అలాంటి కష్టాలు ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ ఇప్పించడం జరిగింది అని చెప్పారు.పిల్లలు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించి స్కూల్ కు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆయన కోరారు.ఇందుకు స్టడీ మెటీరియల్ ను బాగా ఉపయోగించుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సింధుఏజెన్సీ సంస్థ మధుమోహన్, రైడ్స్ సంస్థ వెంకటేశ్వర్లు తో పాటు పెర్లప్ప ,రవి, ఉమ్లనాయక్,జయంతి,భాస్కర్, హనుమన్న,సుబ్బారెడ్డి ఉపాధ్యాయిని ఉపాద్యాయులుమరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.