కుంభస్థలం పై ప్రశాంత్ కిషోర్ గురి..!
1 min readపల్లెవెలుగు వెబ్: భారత రాజకీయ వ్యూహరచనలో సరికొత్త పాఠాలు చేర్చిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అప్పటి వరకు సంప్రదాయ పద్దతిలో చేస్తున్న రాజకీయ వ్యూహరచనకు ప్రశాంత్ కిషోర్ ఫుల్ స్టాప్ పెట్టారు. తనదైన శైలిలో వ్యూహరచనలో కొత్త ఒరవడిని సృష్టించారు. ఏటికి ఎదురీదుతున్న ఎంతో మంది రాజకీయనాయకుల్ని అధికార పీఠం మీదకి చేర్చారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా చేయడం మొదలుకొని.. ఏపీలో జగన్ ను సీఏం చేయడం .. నిన్నమెన్నటి బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, స్టాలిన్ ను సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం వరకు ప్రశాంత్ కిషోర్ తనదైన వినూత్న శైలితో రాజకీయ వ్యూహ రచన చేశారు. బీహార్ లో వైరి వర్గాలైన నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్ లను ఒక్కతాటి మీదకు తెచ్చి బీహార్ మహాఘట్ బంధన్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే.. నితీష్ ఆ కలయిక నుంచి వేరుపడ్డారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ జేడీయూ లో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే.. నితీష్ తో పొసగక ఆ పార్టీ నుంచి బయటికొచ్చారు.
ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ?
ప్రశాంత్ కిషోర్ జేడీయూ నుంచి బయటి వచ్చాక రాజకీయ వ్యూహ రచనకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించాడు. తర్వాత బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. కానీ.. ఆయన ప్రస్తుత కదలికలను చూస్తే 2024 టార్గెట్ గా కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో మోదీ ప్రతిష్ఠ మసకబారుతున్న సందర్బంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఈ కలయికతో ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటనే విషయం స్పష్టమవుతోందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో దీదీకి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసేందుకే శరద్ పవార్ ను కలుస్తాన్ననని ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ.. ఆయన టార్గెట్ 2024 అని తెలుస్తోంది. దేశంలో ని వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో సమావేశమవుతారని సమాచారం. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనేది ప్రచారంలో ఉంది.