రాచర్ల పిల్లల కథా సంకలనానికి ప్రతిభా పురస్కారం
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: విద్యార్థులు స్వయంగా తమ సృజనాత్మక శక్తికి పదును పెట్టి రచించిన కథల సంకలనం “వెలుతురు చినుకులు” తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ లోగల డాక్టర్ చింతోజు బ్రహ్మయ్య బాలామణి ఎడ్యుకేషనల్ మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి బాల ప్రతిభా పురస్కారానికి ఎంపీకకావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, పాఠశాలకు గర్వకారణమని,కథలను రాసిన చిన్నారులు అభినందనీయులని” జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎన్. రాచర్ల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. పురస్కారం ప్రకటించినట్లు ట్రస్ట్ వారి ద్వారా సమాచారం వచ్చిన తర్వాత పాఠశాలలో బాలరచయితలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తలిత కుమారి, గోపాల్, సునీల్, జ్యోతి, ప్రేమ్ కుమార్, లక్ష్మనాయక్, శేషయ్య, సుజాత, జీవలత, ప్రకాశా బాబు పాల్గొన్నారు.