PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ సీఎం చంద్రబాబు విడుదల కోసం దర్గాలో ప్రార్థనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల కావాలని పత్తికొండ పట్టణంలో చెరువు కట్ట కింద ఉన్న పీరు మహోద్దీన్ స్వామి  దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్వరగా విడుదల కోరుతూ, టిడిపికి చెందిన ముస్లిం యువకులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పత్తికొండ టిడిపి ఇన్చార్జి కేఈ శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివ రెడ్డి . మాజీ కేడీసీ చైర్మన్ చల్లా రవి  మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ మీరా హుస్సేన్ మైనార్టీ అధ్యక్షులు ఫక్రుద్దీన్, మైనార్టీ నాయకులు రహమతుల్లా, పీరా మోదిన్ అంగదాటి హుస్సేన్, అబ్దుల్లా, మహబూబ్ బాషా. అల్లా బకాష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 

About Author