PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పీఆర్సీ’పై తగ్గేదే..లే…

1 min read

FAPTO ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఆగ్రహించిన ఉద్యోగులు… ‘ పీఆర్సీ’ పెంచాల్సిందేనని పట్టుబట్టిన వైనం..

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: అసంబద్ధ వేతన సవరణ ఉత్తర్వులు  వద్దని రాష్ట్ర స్థాయిలో  ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(FAPTO) రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడికి ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కు జిల్లా నలుమూలల నుండి వేలాది ఉపాధ్యాయులు తరలి వచ్చారు. వచ్చిన ఉపాధ్యాయుల తో జిల్లా కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుండి ఎన్ టి ఆర్ సర్కిల్ మరియు ప్రధాన రహదారి నిండి పోవటం తో ట్రాఫిక్ ఇబ్బంది గా మారింది. ట్రాఫిక్ క్లియర్ కావటానికి పోలీసులకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూర్తి సహకారాన్ని అందించారు. FAPTO జిల్లా చైర్మన్ ఓంకార్ యాదవ్ మరియు సెక్రెటరీ జెనెరల్ గట్టు తిమ్మప్ప  ఆధ్వర్యంలో కార్యక్రమం  సాగింది.  FAPTO రాష్ట్ర కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇంచార్జ్ కె.ప్రకాష్ రావు ప్రారంభిస్తూ FAPTO ముందు నుండే అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ను బయట పెట్టి దాని పై సంఘాల తో చర్చలు జరిపి సంప్రదాయం ప్రకారం ఫిట్మెంట్ ఐ ర్ కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ,ఉద్యమ కార్యాచరణ FAPTO తో అనేక సంఘాలు మద్దతు ఇచ్చాయి వారందరికీ ధన్యవాదాలు.

వేతన సవరణ పై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు FAPTO ఉద్యమాన్ని కొనసాగిస్తుందని, దానికి కలసి వచ్చే సంఘాల తో సమన్వయం తో ముందుకు వెళతామని ప్రకటించారు.రాష్ట్ర పరిశీలకులు తిమ్మన్న మాట్లాడుతూ ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగం అని,ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమి వర్తించవు అనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి  గుర్తించాలని ఉద్యోగుల ను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం పాలించ లేవని అన్నారు. అనంతరం జిల్లా FAPTO చైర్మన్ ఓంకార్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ఉద్యోగుల కు ఇచ్చిన మాట తప్పి రివర్స్ పి ఆర్ సి ఇచ్చారని, చివరికి పెన్షనర్ లకు కూడా అన్యాయం జరిగే విధంగా ఇచ్చిన జి ఓ లు రద్దయ్యే వరకు ఉద్యమం ను ఆపేది లేదన్నారు.  చదువు చెప్పే ఉపాధ్యాయులను అధికారంలోకి వచ్చిన రోజూ నుండి వివిధ కారణాలతో రోడ్డెక్కిస్తున్న ఘనత  సీఎం కే దక్కిందన్నారు. జిల్లా సెక్రెటరీ జెనెరల్ గట్టు  తిమ్మప్ప అశుటోస్ మిశ్రా కమిటీ రిపోర్టును మూసి పెట్టి ప్రభుత్వం తనకు కావాల్సిన విధంగా అధికారుల తో  తయారు చేపించి, దానికి ముఖ్యమంత్రి  ఏదో దయ తో పెంచినట్టు రాజకీయం చేశారన్నారు. యూటీఫ్ రాష్ట్ర సహాయ  అధ్యక్షుడు  సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్యోగులను విస్మరించడం దారుణం, పైగా తన సొంత మీడియా లో ఉద్యోగుల పై అసత్య ప్రచారం చేయిస్తున్నారని, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ మరియు ఏ పి జి ఎల్ ఐ నిధుల ను దారి మళ్లించి గత సంవత్సరం నుండి రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ఋణాలు మంజూరు కాబడిన ఉద్యోగుల కు  నిధులు విడుదల చేయని ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. ఏ పి టి  ఎఫ్ 257 నుండి జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య గారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సి పి ఎస్ రద్దు చేస్తాను అని మాట తప్పారు అని మరల ఉద్యోగుల సంక్షేమం కొఱకు కృషి చేస్తాను అని ఇప్పుడు మాట తప్పారని ,ఉద్యోగులు మాట తప్పితే యూరక ఉండరని హెచ్చరించారు.  ఏ పి టి ఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ రాష్ట్రంలో  రోజూ రోజుకు ఇంటి అద్దెలు పెరుగుతూ ఉంటే కుంటి సాకులు చూపించి హెచ్ ఆర్ ఏ లు తగ్గించటం అన్యాయం అని, సెంట్రల్ గవర్నమెంట్ వారికి బేసిక్ పే మరియు డి ఎ లు ఎక్కువ అనే కనీస పరిజ్ఞానం లేకపోవడం శోచనీయం అన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన్ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సి పి ఎస్ అంటే సాంకేతిక పరిజ్ఞానం లేదని ఒప్పుకున్నారని,  ఇప్పుడు పి ఆర్ సి అంటే కూడా సరైన పరిజ్ఞానం లేదనే విషయం ఇప్పుడు అర్ధం అయినది. ప్రభుత్వ పరంగా వాళ్లకు అవసరం అయిన విధంగా రిపోర్ట్ తయారు చేశారు. దీన్ని ఉద్యోగులు ఒప్పకోరు అన్నారుడి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొట్ల చంద్రశేఖర్  గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉద్యోగుల కు అన్యాయం చేస్తున్నారు. ఫిట్మెంట్ అనేది ఎప్పుడు ఐ ఆర్ కంటే ఎక్కువ వుండే సంప్రదాయం 10 పి ఆర్ సి లు వచ్చాయి. కానీ సీఎం జగన్ 11 వ పి ఆర్ సి తిరగ రాశారని ఎద్దేవ చేశారు. బి టి ఏ సీనియర్ నాయకుడు రామశేషయ్య చట్టబద్ధంగా వేతన సవరణ కొరకు ఒక చైర్మన్ రాష్ట్ర స్థాయిలో అన్ని ఉద్యోగ సంఘాల నుండి ప్రాతినిధ్యంలు తీసుకొని, జిల్లాలో లో కూడా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు జరిపి ఒక నివేదికను తాయారు చేస్తే కనీసం దాన్ని బయట పెట్టకుండా ఒక నియంత పాలన కోసాగిస్తున్నారు .దీన్ని ఉపాధ్యాయ ఉద్యోగులు సహించరు అన్నారు.  

ముట్టడి కార్యక్రమంలో FAPTO సభ్య సంఘాల యూటీఫ్ నాయకులు ఎల్లప్ప, సుధాకర్, నాగమణి, STU నాయకులు గోకారి మౌలాలి ,ఏ పి టి ఎఫ్ 257  రంగన్న ,ఏ పి టి ఎఫ్ 1938 ఇస్మాయిల్, కమలాకర్ మరియు రామకృష్ణ ,HMA రమేష్,డి టి ఎఫ్  రత్నం ఏసేపు, కరే కృష్ణ బి టి ఏ ఆనంద్ మరియు భాస్కర్ APPTA రాజసాగర్, మధు సుధన్ రెడ్డి మరియు సేవ నాయక్ (FAPTO జిల్లా ఆర్థిక కార్యదర్శి) నాయకత్వం లో ఉపాద్యాయులు పాల్గొన్నారు. FAPTO కలెక్టరేట్ ముట్టడికి మద్దతు ఇచ్చిన ఏ పి పి ఈ టి అసోసియేషన్, RUPP, RJUP,ఏ పి జె ఏ సి,ఏ పి జె ఏ సి అమరావతి, ఎస్ జి టి ఎఫ్ ,ఏ పి జి ఇ ఏ ,ఏ పి డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు పెన్షనర్ అసోసియేషన్ నాయకులు  మద్దతు ఇచ్చిన  అన్ని సంఘాల వారు    పాల్గొన్నారు.

About Author