NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముందస్తు అరెస్టులు ఆపాలి : చంద్రకళ

1 min read

పల్లెవెలుగు వెబ్​: కనీస వేతనం, ఉద్యోగ భద్రత డిమాండ్ల సాధనకు ఈ నెల 14న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాను అడ్డుకునేందుకు… ముందస్తు అరెస్టులు, గృహ నిర్భందాలు ఆపాలని ఏఐటియుసి అనుబంధ సంస్థ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్రకళ డిమాండ్​ చేశారు.  ఆదివారం పోలీసుల అదుపులో గృహనిర్బంధంలో ఉన్న చంద్రకళ మాట్లాడుతూ మార్చి 14న అమరావతి లో జరిగే స్కీమ్ వర్కర్ల ధర్నా హాజరవుతున్న కారణంగా అరెస్టులు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను ఆపడం తగదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసే ఉద్యమాలు ఆపలేరన్నారు. స్కీమ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే  ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు.

About Author