ప్రెగ్నెన్సీ వార్తలు అబద్ధం..!
1 min readపల్లెవెలుగు వెబ్: తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న వార్తల మీద గోవా బ్యూటీ ఇలియానా స్పందించారు. తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న వార్తలు అవాస్తవమని తేల్చేశారు. గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన విషయం నిజమేనని, కానీ ఆ సమయంలో ప్రెగ్నెన్సీ వచ్చినట్టు.. అబార్షన్ చేయించుకున్నట్టు వస్తున్న వార్తలు పూర్తీగా అబద్ధమని చెప్పారు. పరస్పర అంగీకారంతోనే తాను, ఆండ్రూ విడిపోయినట్టు తెలిపారు. చాలా రోజుల తర్వాత బిగ్ బుల్ చిత్రంలో ఇలియాన నటించారు.