ప్రెగ్నెంట్ ఉమెన్ విషయం.. దిగొచ్చిన ఎస్బీఐ
1 min readపల్లెవెలుగువెబ్ : మూడు నెలలు దాటి అభ్యర్థులు విధుల్లోకి చేరడానికి తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది.