గర్భిణీలకు అవసరమైన పరీక్షలు చేయాలి
1 min read
న్యూస్ నేడు, డోన్: బుధవారం లద్ధగిరి ప్రాథమిక ఆరోగ్యాన్ని సంచార చికిత్స కార్యక్రమం అధికారి డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు,అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ లో భాగంగా గర్భిణీలకు అవసరమైన పరీక్షలు చేయాలనీ ఆ వివరాలు మాత శిశు కార్డులో రాయాలని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల మర్యాదగా ప్రవర్తించాలన్నారు, గర్భిణిల నమోదు,నెలనెలా వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని,.హై రిస్క్ గర్భిణీలను ముందస్తుగా ఆసుపత్రుల్లో చేర్పించాలన్నారు, గర్భిణీ లకు పరిశుభ్రత పై బిడ్డ పుట్టిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనా కల్పించాలన్నారు.క్షేత్ర స్తాయి సిబ్బంది క్షేత్ర స్టయిలో పర్యటించి ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలన్నారు, జీవనశైలి వ్యాధులపై మరియు ఆహారపు అలవాట్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.క్షేత్ర స్తాయి సిబ్బంది క్షేత్ర స్టయిలో గర్భిణీ, శిశు ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని .సిబ్బంది సమన్వయ లోపం లేకుండా పనిచేస్తు ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందజేస్తున్న వైద్య,ఆరోగ్య సేవలను సమీక్షించినారు,.ఈ కార్యక్రమంలో వైద్యులు భాస్కర్ ,స్టాఫ్ నర్సులు జయకుమారి, పల్లవి, మహేశ్వరి మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్.