అకాల వర్షం.. దెబ్బతిన్న పండ్ల తోటలు 
1 min readఅన్నమయ్య జిల్లాలో గాలి వాన బీభత్సం-లబోదిబోమంటున్న మామిడి రైతులు
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లాలో మంగళవారం రాత్రి గాలివానా వడగండ్లతో అతలాకుతలం చేసింది.చేతికొచ్చిన మామిడికాయ లు నెలరాలడంతో రైతన్నలు నట్టేట మునిగామని లబోదిబోమంటున్నారు.జిల్లాలో పలుమండలాల్లో వడగండ్ల వాన బీభత్సానికి మామిడి చెట్లు, అల్లనేరేడు చెట్లతో పాటు పలురకాల పండ్ల తోటలు నెలమత్తమయ్యాయి.సంవత్సరాల తరబడి పెంచుకున్న తోటలు కూకటి వేళ్ళతో కూలి పోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం మామిడి పండ్లు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు కొండంత ఆశతోఉన్నారు. అంతలో నే దేవుడువడగండ్ల వాన రూపంలో రైతులకు తీవ్ర నష్టం కలిగించాడు ముఖ్యంగా రామాపురం, వీరబల్లి,సుండుపల్లి తదితర మండలాల్లో జిల్లా స్థాయి ఉద్యాన శాఖ అధికారులు పర్యటించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అదుకొనేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు వేడుకొంటున్నారు.