ఎయిడ్స్ నిరోధానికి ప్రెప్ మాత్రలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లో ఎయిడ్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్ వర్గాల వారికి ప్రీ–ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ (ప్రెప్) ఔషధాలు అందజేస్తోంది. చెన్నైకి చెందిన వలంటరీ హెల్త్ సొసైటీ ద్వారా ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వీటిని పంపిణీ చేస్తోంది. కండోమ్ వినియోగంలో పొరపాట్లు, ఇతర సురక్షితం కాని శృంగారం వల్ల కలిగే ఎయిడ్స్ వ్యాప్తిని ఈ మాత్రలు నిరోధిస్తాయి. బహిరంగ మార్కెట్‌లో 30 మాత్రల ధర రూ.2 వేలు ఉంది. వీటిని సబ్సిడీపై వైద్యశాఖ రూ.450కే పంపిణీ చేస్తోంది. విజయవాడ, వైజాగ్‌లలో ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు.