పిఎం సూర్య ఘర్ పథకానికి అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం జేయండి
1 min read
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
ఉపాధి వేతన దారుల సరాసరి దినసరి రేటును గణనీయంగా పెంచండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై సోలార్ ఫలకలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని ఈ మేరకు మండలాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవవారం కలెక్టర్ ఛాంబర్ నుండి పిఎం సూర్య ఘర్, హౌసింగ్, ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ పిఎం సూర్యఘర్ పథకం క్రింద కేటాయించిన లక్ష్యంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 1,10,348 వినియోగదారులు నమోదు కాగా 87,862 దరఖాస్తులు అర్హత పొందాయని మిగిలిన దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేసేలా స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడిఓలు, ఎఈలు చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ ఫలకలు అమర్చే వెండర్ పేరు, ఫోన్ నెంబరు వివరాలను స్పెషల్ ఆఫీసర్లకు అందజేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. తక్కువ శాతం పురోగతి సాధించిన బనగానపల్లె, రుద్రవరం, సిరివెళ్ల, బండి ఆత్మకూరు, పాణ్యం, నంద్యాల, కోవెలకుంట్ల, సంజామల, ఔకు, బేతంచర్ల, ప్యాపిలి మండలాల ఎఈలను కలెక్టర్ అందుకు గల కారణాలు అడిగి తెలుసుకుంటూ మండలాల వారిగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రధానంగా సోక్ పిట్స్, పశువుల షేడ్స్, పశువుల నీటి తొట్ల నిర్మాణ ప్రగతి ఆశించిన రీతిలో లేదని కేటాయించిన లక్ష్యం పూర్తి చేసేలా శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తపల్లి, వెలుగోడు, పాములపాడు మండలాల్లో ఉపాధి వేతన దారుల సరాసరి దినసరి రేటు 250 రూపాయలు రావడం లేదని యావరేజ్ రేటు గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.