PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధం..

1 min read

– సహన్యాయమూర్తులతో చర్చిస్తాం..
– జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్​
– సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ
దిల్లీ: సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. సహ న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే యత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు.
కోవిడ్​ దృష్ట్యా.. ప్రత్యేక యాప్​
జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సి.జె.ఐ జస్టిస్ ఎన్.వి రమణ. జస్టిస్ కన్విల్ కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజయ్ ల ఆధ్వర్యంలో మూడు రోజుల్లో రూపొందించనున్న యాప్​లో సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ విషయంపై సహ న్యాయమూర్తులతో చర్చిస్తామన్నారు.
బస్సులో తిరిగి.. వార్తలు రాశా..
జర్నలిస్టుల బాధలు, వ్యథలు మాకు తెలుసునని పేర్కొన్న సీజేఐ ఎన్​.వి. రమణ… జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు గుర్తువస్తున్నాయన్నారు. అక్రిడిటేషన్ల మంజూరులో హేతుబద్ధతతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

About Author