PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుండే సిద్ధం కావాలి

1 min read

– ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుండే సిద్ధం కావాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన  నోడల్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల నోడల్ అధికారులతో  జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఇంట్రొడక్టరీ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు  6 నెలల కంటే తక్కువ సమయం ఉంది..  నోటిఫికేషన్ వచ్చే వరకు ఉండి, అప్పటికప్పుడు  హడావుడిగా పనులు చేయడం వల్ల  చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి   ఎన్నికల నిర్వహణకు ముందుగానే నోడల్ అధికారులను నియమించామని, కొన్ని పనులను ఇప్పటినుంచే  మొదలు పెట్టాల్సి ఉంటుందని కలెక్టర్ ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు…నోడల్ అధికారులకు కేటాయించిన విధుల గురించి అవగాహన పెంపొదించుకుని,  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి  తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ ఆదేశించారు.మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కి సంబంధించి  ఖజానా శాఖ ఉప సంచాలకులు,డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్,జిల్లా విద్యాశాఖాధికారి,జిల్లా ఉపాధి కల్పన అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించనున్నందున ఒక్క పోలింగ్ స్టేషన్లో 1+5 మంది అవసరం అవుతారన్నారు.. జిల్లాలో ప్రస్తుతం 2186 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉన్నందున 2200 పోలింగ్ స్టేషన్ లకు  6 మంది చొప్పున,  అదనంగా 30 శాతం బఫర్ తో  సిబ్బందిని  గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు… అన్ని శాఖల నుండి ఇప్పటి నుండే సమాచారం తీసుకోవాలన్నారు.. సమాచారం సేకరణలో ఎవరెవరు సెలవులలో ఉన్నారు, సస్పెండ్ అయ్యారు, పదవీ విరమణ పొందారు, బదిలీ అయ్యారు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి  తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు … 6 నెలల్లో రిటైర్ అయ్యే వారిని ఎన్నికల విధుల్లోకి తీసుకోకూడదన్నారు..ముఖ్యంగా  వారు పని చేస్తున్న నియోజకవర్గంలో లేదా స్వంత నియోజకవర్గంలో నియమించకూడదని తెలిపారు.ట్రైనింగ్ మేనేజ్మెంట్ కు  పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్, జిల్లా పరిషత్ సీఈవో లను నోడల్ అధికారులుగా నియమించామన్నారు.  నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో  ఎక్కువ సామర్థ్యం కూడిన శిక్షణ కేంద్రాలను  ఐడెంటిఫై చేయాలని సంబంధిత నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించి  పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, సివిల్ సప్లైస్ డిఎం, కర్నూలు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ లను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ లిస్ట్ తయారు  చేసుకుని  జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో  ప్రొక్యూర్మెంట్కు టెండర్లు ప్రక్రియ మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్,  ఏపీఎస్ఆర్టీసీ  రీజినల్ మేనేజర్ లను  నోడల్ అధికారులుగా నియమించామన్నారు..ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏ ఏ కేటగిరీ లకు వాహనాలు కేటాయించాలో చూసుకుని ఆ మేరకు వాహనాలను ప్రోక్యూర్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ మరియు ఐటి కి సంబంధించి మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఎన్ఐసి డిస్ట్రిక్ట్  ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లను నోడల్ అధికారులుగా నియమించామన్నారు.. ఎన్నికల సంఘం రూపొందించే సాఫ్ట్‌వేర్ లపై శిక్షణ,  డిజిటల్ రూట్ ప్లాన్స్ తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.  స్వీప్ కార్యక్రమాల నిర్వహణకు  మెప్మా పిడి, సెట్కుర్ సీఈఓ లను నోడల్ అధికారులుగా నియమించామన్నారు..ఓటర్  నమోదు, ఓటు హక్కు వినియోగం అంశాలపై క్యాంపెయిన్ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ వి ఎం మేనేజ్మెంట్ కి సంబంధించి డిఆర్ఓ, డిపిఓ లను నోడల్ అధికారులుగా నియమించామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు డ్వామా పిడి, హౌసింగ్ పిడి ని నోడల్  అధికారులుగా నియమించామన్నారు.. అవసరమైన ప్రతి చోట ఎం సి సి టీమ్ లు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు…ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కి  డిసిఓ, జిల్లా ఆడిట్ అధికారిని నోడల్ అధికారులుగా నియమించాని, పోస్టల్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం (ETPBS) కు సంబంధించి డిపిఓ, డిఆర్డిఏ పిడి, బీసీ సంక్షేమ శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని కలెక్టర్ తెలిపారు.. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి అన్ని శాఖల నుండి అప్లికేషన్ లు తీసుకోవడంతో పాటు వాటిని డిస్పాచ్ చేయడంలో కూడా జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరించాలన్నారు.మీడియా కు సమాచారం అందచేసే అంశాలతో పాటు ఎంసీఎంసీ నిర్వహణ చేసేందుకు సమాచార శాఖ ఉప సంచాలకులు, జిల్లా ఫిషరీస్ అధికారిని  నోడల్ అధికారులుగా నియమించామన్నారు..ఎలక్టోరల్ రోల్స్ కి సంబంధించి పశు సంవర్థక శాఖ,జిల్లా హార్టికల్చర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని, కంప్లైంట్ రిజిస్ట్రేషన్, ఓటర్ హెల్ప్ లైన్ కి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు,  పిడి, apmip లను, కమ్యూనికేషన్ ప్లాన్ కు సమగ్ర శిక్ష ఏపీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లను,  అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ల కు డిఎఫ్ఓ, కుడా వైస్ చైర్మన్, జిల్లా పర్యాటక శాఖ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామని కలెక్టర్ వివరించారు. 

పోలింగ్ స్టేషన్లలో అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటుకు పంచాయతీరాజ్ ఎస్ఈ, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ, ఎపిఈడబ్ల్యుఐడిసి అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు.. అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి ర్యాంప్ వాడే విధంగా ఉందా లేదా, టాయ్లెట్ విత్ రన్నింగ్ వాటర్, త్రాగు నీరు, షెడ్, ఎలక్ట్రిసిటీ వంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకొని టెండర్ ప్రక్రియ చేపట్టాలన్నారు..రాయలసీమ యూనివర్సిటీలో  స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ రూమ్స్ లో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఏర్పాట్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బి ఎస్ఈ, ఇరిగేషన్ ఎస్ఈ, టిడ్కో  ఎస్ఈ లను నోడల్ అధికారులుగా నియమించామని, వాటిని పరిశీలించి ఇప్పటినుండి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ జి. కృష్ణ కాంత్ మాట్లాడుతూ కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ మరియు ఐటి నోడల్ అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాలకు డిజిటల్ రూట్ మ్యాపింగ్ కు చర్యలు తీసుకోవాలన్నారు.. . లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.. అక్రమంగా మద్యం సరఫరా అంశంపై దృష్టి సారించామని ,పల్లె నిద్ర కార్యక్రమంలో  ఫ్యాక్షన్ గ్రామాలు, హాని కలిగించే  ప్రాంతాలను గుర్తించి  డీఎస్పీ ఆధ్వర్యంలో  సంబంధిత వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యమైన గ్రామాలలో ఎంట్రీ మరియు ఎగ్జిట్,  ముఖ్యమైన చోట్ల సిసిటివి కెమెరాల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, అదనపు ఎస్పీ సర్కార్, డిఆర్ఓ మధుసూదనరావు, ఈఆర్ఓ లు, నోడల్ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పత్తికొండ ఆర్డిఓ రామలక్ష్మి, ఏ ఈ ఆర్ వో లు పాల్గొన్నారు.

About Author