హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది : కర్నూలు జిల్లా మహానంది మండలం లోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు కూడా అందరినీ బదిలీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏటిడబ్ల్యూఓ హుసేనయ్య పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మరియు హెచ్ ఎం మధ్య పని విషయంలో వాగ్వాదం ఇవాళ తారాస్థాయికి చేరడంతో బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులు కూడా నివేదిక రూపంలో అందజేసి బదిలీకి సిఫార్సు చేస్తున్నట్లు ఏటి డబ్ల్యూ ఓ తెలిపారు. సోమవారం రోజున విచారణ జరిపిన ఏ టి డబ్ల్యూ ఓ మంగళవారం కూడా పాఠశాలలో గొడవ సద్దుమణిగక పోవడంతో విచారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.