ముందస్తు ఎన్నికలకు సిద్ధం : చంద్రబాబు
1 min read
పల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే.. ఎదుర్కొనేందుకు సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వ అరాచకాలను ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని, వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని, దానిపై తాను స్పందించనన్నారు. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. పని చేయని నేతలు, ఇన్‌చార్జ్‌లను పక్కన పెట్టేస్తామన్నారు. ఎవరి కోసమో పార్టీ త్యాగాలు చేయదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.