హెలీకాప్టర్ నిండా నోట్ల కట్టలతో పారిపోయిన అధ్యక్షుడు !
1 min read
FILE PHOTO: Afghanistan's President Ashraf Ghani speaks during his inauguration as president, in Kabul, Afghanistan March 9, 2020. REUTERS/Mohammad Ismail//File Photo
పల్లెవెలుగు వెబ్ : దేశ ప్రజలను రక్షించాల్సిన అధ్యక్షుడే తాలిబన్లకు భయపడి పారిపోయాడు. దేశ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. తాలిబన్లకు భయపడి పారిపోయిన ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీపై దేశ ప్రజలు మండిపడుతున్నారు. రక్తపాతం నివారించేందుకే దేశం విడిచి వెళ్లినట్టు ఘనీ వివరణ ఇచ్చినప్పటికీ.. ఓ రష్యా వార్త సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది. అప్ఘాన్ అధ్యక్షుడు హెలీకాప్టర్ నిండా నోట్లకట్టలతో పాటు, నాలుగు కార్లతో దేశం నుంచి పారిపోయారని ఆ వార్త సంస్థ వెల్లడించింది. హెలీకాప్టర్ లో స్థలం చాలకపోవడంతో కొంత డబ్బును ఆఫ్గన్ లోనే వదిలివెళ్లిపోయారని ఆ సంస్థ తెలిపింది.