NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాడేపల్లిలో శిక్షణ తరగతులకు హాజరైన బీసీ సెల్ అధ్యక్షుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా : విజయవాడ తాడేపల్లి నందు హోటల్ శ్రీఫార్చ్యూన్ గ్రాండ్ నందు శుక్రవారం జరిగిన శిక్షణ తరగతు లకు అన్నమయ్య జిల్లా బీ సీ సెల్ అధ్యక్షుడు మోడమ్ నాగ భూషణం హాజరయ్యారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ కులాల అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణమూ ర్తి గారి పిలుపుమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వైయస్సార్సీపి బీసీ సెల్ అధ్యక్షులు సమావేశమునకు రావడం జరిగింది ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన శ్రీ జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో సమావేశం దిగ్విజయంగా జరిగినది ఈ కార్యక్రమకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్సార్సీపీ విభాగాల కోఆర్డినేటర్ మరియు చంద్రగిరి శాసనసభ్యులు గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హాజరై రాష్ట్రంలో బీసీ కులములకు మన ముఖ్యమంత్రి చేపట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి పదవుల గురించి చాలా వివరముగా సమావేశంలో వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నుండి బీసీ సెల్ అధ్యక్షులు మోడం నాగభూషణం మరియు చిత్తూరు జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అన్నమయ్య జిల్లా ల కోఆర్డినేటర్ రమేష్ గౌడ్ గారు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేయడం జరిగినది రాష్ట్ర బీసీ కులముల అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ త్వరలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీపై ఉన్నదని తెలియజేయడం జరిగినది.

About Author