PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అడ్వకేట్ జే. వెంకటరాముడు ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు బారు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 29ఓట్ల మెజారిటీ తో  సీనియర్ అడ్వకేట్ జే. వెంకట రాముడు విజయం సాధించారు. నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన  వెంకట రాముడును  మండ్లెం మాజీ సర్పంచ్ ఎై వి రమణ, సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు,ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎల్.స్వాములు, దళిత సంఘం నాయకుల జి.ప్రతాప్ , హుసేన్ తదితరులు శనివారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో అన్ని రకాల న్యాయ పరమైన అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి 23 సంవత్సరాలుగా సేవలందిస్తూన్న జే.వెంకటరాముడికి నూతన బార్ అసోసియషన్ ప్రెసిడెంట్ గా  అవకాశం కల్పించడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి లాయర్ల సమస్యల పట్ల గలం వినిపించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు అన్నారు.

About Author