దేశ అధ్యక్షుడు.. దారుణ హత్య !
1 min readపల్లెవెలుగు వెబ్ : హైతి దేశ అధ్యక్షుడు దారుణహత్యకు గురయ్యాడు. కరేబియన్ దేశమైన హైతికి జొవెనల్ మొయిసే అధ్యక్షుడు. జొవెనల్ మొయిసే ఇంట్లోకి చొరబడ్డ దుండగులు .. అధ్యక్షుడు, అతని భార్యపై తుపాకులతో దాడి చేశారు. ఈ దాడిలో అధ్యక్షుడు మృతి చెందగా.. ఆయన భార్య తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని అమానవీయ, దుర్మార్గపు చర్యగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. దేశంలో రాజకీయ,ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో.. గ్యాంగ్ వార్ లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి హత్య జరిగింది.