PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పోతుల శేఖర్ కి సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నిన్న జరిగిన ఎన్నికలలో ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్ గా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పోతుల శేఖర్  గెలుపొందడం కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన శుభ సూచకమని శుభసమయమని నేటితో కాంగ్రెస్ పార్టీకి శుభసూచకం అని ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు  ఆధ్వర్యంలో శుక్రవారం  జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. డిసిసి అధ్యక్షులు కే బాబురావు  మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులైన పోతుల శేఖర్ ని డైరెక్టర్ గా ఎన్నుకున్నందుకు మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపి శేఖర్  ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని శేఖర్  ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో చేపడుతున్నాడని వితంతువులకు ఆర్థిక సహాయాలు అనాధ బాలలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా విద్యాభ్యాసం, రైతులకు ఉపయోగపడే పరికరాలు మందులు ఇచ్చి రైతులకు వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తున్న శేఖర్ కి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నానని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పోతుల శేఖర్  సన్మాన కార్యక్రమంలో శేఖర్ని శాలువా, కండువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్ పోతుల శేఖర్  మాట్లాడుతూ డైరెక్టర్ గా గెలిపించిన మత్స్యకార సంఘం అధ్యక్షులకు మరియు మత్స్యకారులకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నానని మత్స్యకారుల సంక్షేమానికి సాయశక్తుల కృషి చేస్తానని మత్స్యకారులకు వర్తించే అన్ని సంక్షేమ పథకాలను వారికి చేరే విధంగా అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చి, గంగపుత్ర సంఘం గౌరవాధ్యక్షులు ఉండవెల్లి వెంకటన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అలాగే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం గంగపుత్ర సంఘం గౌరవ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉండవల్లి వెంకటన్న కి శేఖర్ సన్మానించారు. కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు శేఖర్కి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ కర్నూల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు ఏవి సుజాత ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ డిసిసి కార్యదర్శి కురువ నరసింహులు మంత్రాలయం వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కోఆర్డినేషన్ మెంబర్ వి సాంబశివుడు కాంగ్రెస్ నాయకులు కే వెంకటరెడ్డి ఎన్ సి బజారన్న పత్తికొండ ఏ వి నాయుడు కొత్తపేట మున్న షేక్ మాలిక్, జావిద్ వసిబాష మొదలగు వారు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author