బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం.. హైకోర్టులో పిటిషన్
1 min readపల్లెవెలుగు వెబ్ , కడప : బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం.. కుటుంబ పోరుగా మారింది. మఠ పీఠాధిపతి వీరభోగ వసంతరాయలు శివైక్యంతో.. సమస్య ప్రారంభమయింది. వీరభోగ వసంతరాయలు మొదటి భార్య కొడుకు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా ఎన్నుకున్నారు. అయితే.. ఆయన రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ హైకోర్టు తలుపు తట్టారు. పెద్ద మనుషుల రాజీ చర్చల్లో తమను బలవంతంగా ఒప్పించారంటూ పిటిషన్ వేశారు. పీఠాధిపత్యం అనేది వీలునామా ప్రకారమా ?. లేదా.. కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమా ? అన్న విషయం తేల్చాలని హైకోర్టును ఆశ్రయించింది. వీలునామా ప్రకారం తన కొడుకుకే పీఠాధిపత్యం దక్కాలని కోరుకుంటున్నట్టు ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని పిటిషన్ లో పేర్కొన్నారు.