ఉపాధ్యాయుల పై ఒత్తిడి తగదు : ఆప్తా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉపాధ్యాయులు తమ అటెండెన్స్ ను 9 గంటల ముందే వేయాలని, పిల్లల హాజరు ఉదయం 9.30 నిముషాలు లోపు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని , సెలవు 9 గంటల లోపు అప్లై చేయాలని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు పేర ఐ టి సెల్ పేర వాట్సాప్ ద్వారా సమాచారం చక్కర్లు కొట్టి ఉపాద్యాయులను ఆందోళనకు గురి చేస్తుంది . ఈ విషయంలోగతంలో కమీషనర్ వారు 21/8/2022 ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారం 10 నిముషాలు గ్రేస్ పీరియడ్ ని టీచర్లకు అమలు చేయాలని, మరియు ఉదయం 9.15 నిముషాలకు ప్రార్ధన ముగుస్తుందని 9.30 నిముషాల లోపు విద్యార్థుల హాజరు ఆన్లైన్ లో ఎలా సబ్మిట్ చేయడం ఎలా సాధ్యమని కమీషనర్ వారు ఈ విషయం లో పాత పద్దతిలో 10.30 నిముషాల కు సమయాన్ని పొడిగించాలని, కొన్ని పాఠశాలల్లో 500 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 15 నిముషాల లోపు విద్యార్థులు అటెండెన్స్ ఎలా ఆన్లైన్ చేయగలరని అప్తా రాష్ర్ట అద్యక్షుడు గణపతి రావు మరియు రాష్ర్ట కార్యదర్శి కె ప్రకాష్ రావు ప్రశ్నించారు.కాబట్టి ఈ విషయం లో కమీషనర్ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు తగు అదేశాలు జారీ చేసి టీచర్ల యందు ఏర్పడిన మానసిక ఒత్తిడి తొలగించాలి అని వారు కోరారు.