కల్తీ విత్తనాలను అరికట్టాలి
1 min readరైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయాలి
ఎమ్మార్పీ ధరకే విత్తనాలు ఎరువులు విక్రయించాలి
ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రైతులకు అందించే విత్తనాలు ఎరువులు సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు.శనివారం దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో రైతు సంఘం దేవనకొండ మండల కమిటీ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన హాజరయిన జి రామకృష్ణ మాట్లాడుతూ, కొన్ని కంపెనీల విత్తనాలు పత్తి వేరుశనగ మిరప లాంటి విత్తనాలు గత సంవత్సరం పంట ఉత్పత్తిలో మెరుగుగా వచ్చిన విత్తన కంపెనీలు ఈ సంవత్సరం అదునుగా చూసుకుని ఎమ్మార్పీ రేట్లు కన్నా అధిక ధరలతో అమ్ముతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం నకిలీ విత్తనాల వల్ల తెగుళ్ల వల్ల దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపో యారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ వారు ముందు జాగ్రత్తగా తనిఖీలు చేయడం, రైతులను మేల్కొల్పడం వంటి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ప్రధానంగా పత్తి అనేక రకాల విత్తనాలు ఇతర రాష్ట్రాల నుండి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి రైతులకు అంటగట్టి నిట్టనిలువునా ముంచు తిన్నారని అన్నారు.ఈ తతంగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు గుడ్లప్పగించి చూడటం తప్ప ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఇలాగే కొనసాగితే రైతులు పంటలు వేయడం మానేయాల్సిన అగాయిత్యం ఏర్పడుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో రైతులంతా క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు.