అనధికార నిర్మాణాలు అడ్డుకోండి..
1 min read– పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించిన కమిషనర్ వె. ప్రసన్న
పల్లెవెలుగు వెబ్, విజయవాడ : నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార నిర్మాణలను తొలిదశలోనే అడ్డుకోవాలని, నగరంలో జరుగుతున్న అపార్ట్మెంట్లు, బిల్డింగ్, అన్ని ప్లాన్‌లు పరిశీలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు నగర పాలక సంస్థ కమిషనర్ వె. ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కమిషనర్ వె. ప్రసన్న వెంకటేష్ చాంబర్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, డిప్యూటీ సిటి ప్లానర్ జె.సూరజ్ కుమార్, అసిస్టెంట్ సిటి ప్లానర్లు యం.జగదీష్, ఇ.బాలాజీ మరియు పట్టణ ప్రణాళిక విభాగపు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. భవన నిర్మాణలకు సంబంధించి సిబ్బంది మరియు అధికారులపై ఎటువంటి ఫిర్యాదుల వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతుల కోరకు అన్‌లైన్ నందు వచ్చిన దరఖాస్తులు మరియు నగర పాలక సంస్థ పుర సేవ విభాగం ద్వారా వచ్చిన సమస్యలపై ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పరిష్కారించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు .