NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట..

1 min read

ఫోరెన్సిక్  ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై వర్క్ షాప్ .

కర్నూలు, న్యూస్​ నేడు:  నేరం చేసిన నిందితులు తప్పించుకోవడానికి వీలులేకుండా శిక్షలు పడే విధంగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట వేస్తామని కర్నూలు అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా తెలిపారు.నేరస్థులు తప్పించుకోకుండా నేర స్థలంలో సాక్ష్యా ధారాల సేకరణ, వాటి భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలనే విషయంపై పోలీసు అధికారులు, దర్యాప్తు అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి  , ఆంధ్రప్రదేశ్ డిజిపి ల ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై వర్క్ షాప్   నిర్వహించారు. శుక్రవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో  ఫోరెన్సిక్  ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల అధికారులు, దర్యాప్తు అధికారులు,  స్టేషన్ రైటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్  మాట్లాడుతూ…నేరగాళ్లు సాంకేతికతను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు మాట్లాడారు. సాక్షులు రాజీ అయినా కూడా నిందితులకు  సైంటిఫిక్ ఎవిడెన్స్ తో శిక్షలు పడేవిధంగా చేయడమే ఈ కార్యక్రమమని తెలిపారు. పోలీసు అధికారులకు, దర్యాప్తు అధికారులకు, స్టేషన్ రైటర్లకు పలు విషయాల పై దిశా నిర్దేశం చేశారు. సందేహాలను నివృత్తి చేశారు. హత్యలు, పోక్సో కేసులు, సైబర్ క్రైమ్ వంటి నేరాలు జరిగినప్పుడు దర్యాప్తులు పకడ్బందీగా చేపట్టాలన్నారు.  ఫోరెన్సిక్ సంబంధించి సాక్ష్యాలను ఏవిధంగా సేకరించాలనే విషయాల పై అవగాహన చేశారు. డిఎన్ఎ విశ్లేషణ , వేలిముద్రలు , రక్తపు మరకల నమూనాల లో  సాక్ష్యాదారాలు సేకరించడం,   కేసుల నమోదు , సంబంధిత ప్రోసిజర్ సీజ్ చేసిన సెల్ ఫోన్లు, మొబైల్ నెంబర్లు, సిసిటివి పుటేజి లు,  సంఘటన ప్రాంతాలలో దొరికిన ప్రతి వస్తువులను, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించేటప్పుడు ఆ  పత్రాల పై అధికారుల సంతకాలు, స్టాంప్ ముద్ర సీళ్ళు,  పకడ్బందీగా 48 గంటలలో  పంపించాలని ఫోరెన్సిక్ నిపుణులు పోలీసు అధికారులకు , దర్యాప్తు అధికారులకు తెలియజేశారు. అనంతరం  డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సరళాదేవి, ఎపిపి ఖాధర్ భాషా, డాక్టర్ రంగయ్య, డిఎస్పీలు  ఫోరెన్సిక్ నిపుణులకు పోలీసు అధికారులు జ్ఞాపికలు అందజేశారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా తో పాటు డిఎస్పీలు బాబు ప్రసాద్ , శ్రీనివాసాచారి ,ఉపేంద్రబాబు, వెంకట్రామయ్య, రామాంజినాయక్ ,  ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్స్ లు డా.ఎస్. అసీంబాషా, డా. ఎం. కిశోర్ కుమార్ రెడ్డి, జి.శ్యాంప్రసాద్, కుమారస్వామి , జిజిహెచ్ డాక్టర్లు, పిపిలు, ఎపిపిలు,  సిఐలు, ఎస్సైలు, ఫోరెన్సిక్ విభాగం మరియు ఫింగర్ ప్రింట్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *