NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఆన్​లైన్​’ తో ముందస్తు దర్శనం..

1 min read

ఆర్జిత సేవా టికెట్లు తప్పని సరి

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: దేవస్థానములో కోవిడ్ నివారణకై పలు ముందు జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి.. ఇందులో భాగంగా భక్తులు ఉచిత దర్శనానికి కూడా ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించబడింది. అదేవిధంగా భక్తులు శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం టికెట్లను, ఆర్జిత సేవాటికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే ఏర్పాట్లు చేయడం జరిగింది.  కావున ఉచిత దర్శనానికి విచ్చేసే భక్తులు, శీఘ్రదర్శనం (రూ.150/-లు. రుసుముతో, అతిశీఘ్రదర్శనం (రూ.300/-లు, రుసుముతో) మరియు ఆర్జిత సేవాటికెట్ల పొందాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పొందవలసినదిగా తెలియజేస్తున్నాం. మంగళవారం నుంచి  కేవలం ఆన్ లైన్ టికెట్ పొందినవారిని మాత్రమే దర్శనానికి మరియు ఆర్జితసేవలకు అనుమతించడం జరుగుతుంది. దేవస్థానం వెబ్సైట్ www.srisalladevasthanam.org ద్వారా టికెట్లను పొందవచ్చును. ఆన్లైన్ ద్వారా టికెట్ రిజిస్ట్రేషన్ పొందేటప్పుడు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయవలసి వుంటుంది. అదేవిధంగా భక్తులు వారికి కేటాయించిన సమయములోనే దర్శనానికి, ఆర్జితసేవలకు  విచ్చేయవలసినదిగా కూడా తెలియజేయడమైనది. ఈ విషయములో భక్తులు సహకరించవలసినదిగా కూడా కోరుతున్నాము. ఇంకా కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కును ధరించేవిధంగా అవగాహన కల్పించడం జరుగుతోంది. అదేవిధంగా దర్శనం క్యూలైన్లలో, ఆర్జితసేవలు జరిపించుకునే సమయములో భక్తులు భౌతికదూరం పాటించేవిధంగా కూడా చర్యలు తీసుకోబడుతున్నాయి.

About Author