రాజీనామాకు ప్రధాని అంగీకారం !
1 min read
పల్లెవెలుగువెబ్ : శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు, ఆర్థిక సంక్షోభం తీవ్రత నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలని ఆయనను దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స కోరారని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని జాతీయ మీడియా చెప్తోంది. శ్రీలంక మీడియాను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే నేతృత్వంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహిందను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని గొటబయ కోరారు. అందుకు మహింద అంగీకరించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రధాని మహింద విఫలమైనందు వల్ల ఆ పదవి నుంచి ఆయన వైదొలగాలని కోరినట్లు శ్రీలంక కేబినెట్‌కు గొటబయ తెలిపారు.