PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIITDM కర్నూల్ 5G Use Case ప్రయోగశాలను  ప్రారంభించిన ప్రధాని

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  యూనియన్ బడ్జెట్ 2023-24  లో  ప్రకటించిన విధంగా  5G Use Case   ప్రయోగశాలల  స్థాపన కోసం భారతదేశంలోనే  100 విద్యాసంస్థలలో IIITDM కర్నూల్  ఒకటిగా ఎంపిక చేయబడింది.  27 అక్టోబర్ 2023న  గౌరవనీయ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023  ప్రారంభ  కార్యక్రమంలో   ఈ 5G ల్యాబ్స్ ని వర్చువల్ గా  ప్రారంభించారు.ఆత్మనిర్బర భారత్, మేకిన్ ఇండియా మరియు  డిజిటల్ ఇండియా  కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో 5G టెక్నాలజీలో నైపుణ్యతను పెంపొందించడానికి మరియు స్ట్రాటప్   కమ్యూనిటీలకు అవసరమైన సేవలు అందించటానికి,  భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ  దేశవ్యాప్తంగా  ఉన్నత విద్యాసంస్థలలో  5G  ల్యాబ్స్ ను  ఏర్పాటు చేయడం జరిగింది. IIITDM కర్నూల్ ఈ 5G ప్రయోగశాల ద్వారా  5G నెట్ వర్క్  లు,  రూరల్ టెక్నాలజీ అప్లికేషన్స్,  రైల్వే,  హెల్త్ కేర్,  ఎడ్యుకేషన్,  స్పోర్ట్స్,  అగ్రికల్చర్  మరియు  మైనింగ్  లకు  సంబంధించిన  వివిధ  పరిశోధన అంశాలపై  దృష్టి సారించనుంది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో IIITDM  కర్నూల్ డైరెక్టర్  ప్రొఫెసర్ సోమయాజులు, భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ. రవితేజ,  అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author