బహిరంగ క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ
1 min readపల్లెవెలుగువెబ్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆ సభలో మాట్లాడకుండా వెళ్లిపోయారు. తన కోసం వచ్చిన వేలాది మంది అభిమానుల కోసం మోకాళ్లపై కూర్చొని అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని ఇలా చేయడానికి బలమైన కారణమే ఉంది. శుక్రవారం అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అనంతరం రాజస్థాన్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ రోజంతా బిజీబిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో సిరోహిలోని అబు రోడ్ ప్రాంతంలో జరిగిన సభకు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే సమయం రాత్రి 10 గంటలు దాటింది. అయినా మోదీ కోసం వేలాది మంది సభలో ఉన్నారు. కానీ, రాజస్థాన్‌లో 10 తర్వాత లౌడ్ స్పీకర్స్ ఉపయోగించకూడదన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మోదీ తాను కూడా నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నారు.