NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం ఉద‌యం చోటుచేసుకుంది. ఈ విష‌యాన్ని ప్రధాని కార్యాల‌యం ట్వీట్ చేసింది. ప్రధాని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింద‌ని, ఏవైనా పోస్టులు వ‌స్తే.. స్వ‌ల్ప‌కాలం పాటు స్పందించ‌వ‌ద్దని తెలిపింది. మోదీ వ్యక్తిగ‌త ట్విట్టర్ ఖాతా నుంచి ఆగంత‌కులు బిట్ కాయిన్ ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు. భార‌త్ లో బిట్ కాయిన్ లీగ‌ల్ చేశార‌ని, ప్రభుత్వం 500 బిట్ కాయిన్ లు కొనుగోలు చేసి ప్రజ‌ల‌కు పంచుతోంద‌ని పోస్ట్ చేశారు. వెంట‌నే స్పందించిన పీఎంవో అధికారులు ట్విట్టర్ యాజ‌మాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ట్విట్టర్ యాజ‌మాన్యం ఆ ట్వీట్ ను తొల‌గించి.. మోదీ ట్విట్టర్ అకౌంట్ ను పున‌రుద్ధరించింది.

About Author