రాజీనామా చేయనున్న ప్రధాని !
1 min readపల్లెవెలుగు వెబ్ : మలేషియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ సోమవారం రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. ముహిద్దీన్ రాజీనామా చేయనున్నట్టు ఆ దేశ అధికార పోర్టల్ ఆదివారం వెల్లడించింది. బలనిరూపణలో భాగంగా మలేషియా ప్రధాని మెజారిటీ కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వంలో ముహిద్దీన్ మెజార్టీ కోల్పోయినట్టు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం, కరోన తో మలేషియాలో అనిశ్చితి నెలకొంది. తదుపరి ప్రధానిని మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్ ఖరారు చేయనున్నారు.