PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జపాన్‌కు టాటా చెప్పిన రాకుమారి.. సామాన్యురాలిగా అమెరికాకు పయనం..!

1 min read


పల్లెవెలుగువెబ్: వేల కోట్ల సంపద, పేరు ప్రతిష్ట ఇవ్వన్నీ… ప్రేమ ముందు నిలబడలేకపోయాయి. ప్రేమించిన యువకుడి కోసం తన రాచరికాన్ని సైతం వదులుకుంది జపాన్ రాకుమారి మాకో. కాలేజీలో తన క్లాస్‌మేట్అయిన కీ కొమురోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కీ కొమురో ఓ సాధారణ మధ్యతరగతికి చెందిన వాడు. అతన్ని వివాహం చేసుకోవడానికి రాచరికం, వేల కోట్ల ఆస్తులు, అంతస్తులను సైతం తృణప్రాయంగా వదులుకుంది జపాన్ రాకుమారి మాకో. వీరి పెళ్లికి రాజ కుటుంబం అడ్డుచెప్పడంతో ఇటీవల టోక్యోలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. మాకో… జపాన్ చక్రవర్తి నరు‌హిటోకేకు స్వయాన మేనకోడలు. వివాహ అనంతరం మాకో, జపాన్‌కు టాటా చెప్పి.. ఓ సామాన్యురాలుగా కొత్త జీవితాన్ని ఆరంభించడానికి అమెరికాకు నిన్ననే బయలుదేరి వెళ్లారు.

About Author