NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోడ్ల నిర్మాణాల పై అధికారులతో  ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష

1 min read

జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు  అవసరం ఉంటే  ప్రతిపాదనలు పంపండి

జిల్లాలో మిషన్ పాట్ హోల్ కింద పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయండి

రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు  అవసరం ఉంటే  ప్రతిపాదనలు పంపాలని రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో  రహదారులు, భవనాలు మరియు రవాణా శాఖలో  చేపడుతున్న రోడ్ల నిర్మాణాలు, ఇతర అంశాలపై అధికారులతో  ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ జిల్లాలో ఏవైనా ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు చేయాల్సి ఉంటే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటామని అధికారులకు సూచించారు..రాష్ట్రంలో క్రిటికల్ గా ఉన్న రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరామని, త్వరలో నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు.   జిల్లాలో మిషన్ పాట్ హోల్ కింద రూ.19.52 కోట్ల తో 822 కిలోమీటర్లలో జరుగుతున్న పనులకు సంబంధించి, ఇప్పటివరకు 798 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి చేసి 97 శాతం పనులు పూర్తి చేశారని, పెండింగ్ లో ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని  ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ అండ్ బి ఎస్ఈ ని ఆదేశించారు.. సి కేటగిరి లో  నాబార్డ్ , ఎస్హెచ్ ప్లాన్, ఎండీఆర్ ప్లాన్, అదనపు ఎండీఆర్ ప్లాన్ కింద 28 పనులకు గాను 250 కిలోమీటర్లకు 101.51 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఆర్ అండ్ బి ఎస్ఈ ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొని వచ్చారు.ఎన్ హెచ్ 340 సి కి సంబంధించి 2.34 కిలోమీటర్ల రోడ్ల  నిర్మాణపు పనులను జాయింట్ కలెక్టర్, కర్నూలు మునిసిపల్ కమిషనర్ల తో సమన్వయం చేసుకోవాలని  ప్రిన్సిపల్ సెక్రెటరీ సంబంధిత అధికారిని ఆదేశించారు. రవాణా శాఖ కి సంబంధించి  డ్రైవర్ ల అవసరం పెద్ద ఎత్తున ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 వేల మంది డ్రైవర్లను శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు..ఇందులో భాగంగా  ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందన్నారు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ ట్రాక్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు..వాహనాల రిజిస్ట్రేషన్ లలో పెండింగ్ లేకుండా చూసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ అంశాలపై  నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కమీషనర్ ను ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, డిటిసి శాంతకుమారి, నేషనల్ హైవే ఎస్ డి సి సునీత తదితరులు పాల్గొన్నారు.

About Author