PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రిన్సిపల్ సెక్రెటరీ తీరు విద్యావ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఉంది : ఫ్యాప్టో

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తీరు విద్యావ్యవస్థని గాడిలో పెట్టే విధంగా లేదని, నిర్వీర్యం చేసే విధంగా ఉందని ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ. అభిప్రాయపడుతోంది. వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాల్సింది పోయి వ్యవస్థ మొత్తాన్ని లోపాల పుట్టగా చూపిస్తున్నారని చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయులను నిందించటం, మెమోలు షోకాజ్ నోటీసులు మరియు సస్పెన్షన్లతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తూ మొత్తం లోపమంతా ఉపాధ్యాయుల దేనని విపరీత ధోరణితో ప్రజలలో చులకన చేసేలా వారి విధానం ఉంది. విద్యార్థులు షూస్ ధరించలేదని యూనిఫామ్ ధరించలేదని వర్క్ బుక్స్ పూర్తి చేయలేదని అనేక కారణాలు చూపిస్తూ ఉన్నారు. కానీ గత విద్యా సంవత్సరంలో జూన్ నుండి నవంబర్ వరకు పుస్తకాలని సరఫరా చేసిన ప్రభుత్వ లోపాన్ని గురించి మాత్రం వారు మాట్లాడరు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని చెప్తూనే వారు మాత్రం సస్పెండ్లు చేస్తుంటారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మరియు నోట్స్ దిద్దడం మాత్రమే మీ పనిని ఇది కూడా చేయలేరని లక్షల్లో జీతాలు మీకు దండగని ఉపాధ్యాయులను అనుక్షణం అవమానిస్తూ వారి ప్రవర్తన కొనసాగుతుంది. ఈ ధోరణి వలన ప్రజల్లో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఏదైనా విద్యా సంబంధ విషయాల లో లోపాలను గుర్తించినప్పుడు వాటిని పై అధికారిగా ఉపాధ్యాయులకు తెలియజెప్పి దాన్ని సరిదిద్దాల్సింది పోయి పూర్తి వైఫల్యం అంతా ఉపాధ్యాయుల దే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు వారు తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతోంది. గత సంవత్సరం మొత్తంలో నాడు నేడు అని పాఠశాలల విలీనం అని ప్రమోషన్లని వర్క్ అడ్జస్ట్మెంట్లని జూన్ నుండి ఫిబ్రవరి వరకు ఒక గందరగోళ పరిస్థితి కి ఉపాధ్యాయులను గురిచేసి నానా రకాల యాప్ల భారాన్ని ఉపాధ్యాయుల మీద మోపి పాఠాలు చెప్పలేని పరిస్థితి కల్పించి ఇప్పుడు విద్యా సంవత్సరం చివరిలో తనిఖీలు అంటూ హడావుడి ఎందుకో అర్థం కాని పరిస్థితి. ఇదే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరంలో నమ్మకం కోల్పోయిన తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి పర్యటనలు అంటూ మొత్తం విద్యావ్యవస్థని ప్రైవేటుపరం చేయడానికి పొమ్మనకుండా పొగబెట్టిన చందంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ గారి పర్యటనలు అర్థమని ఫ్యాప్టో భావిస్తుంది. ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఉపాధ్యాయుల లోకాన్ని ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం ఉద్యమించుతామని హెచ్చరించారు.

ప్రమోషన్లు, వైఫల్యం, పాఠాలు, బలోపేతం, ఒత్తిడి,

About Author