PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపి హాయాంలోనే బిసిలకు ప్రాధాన్యత!!

1 min read

– కర్నూలుకు ఏ.పి.ఈ.ఆర్.సి. ప్రధాన కార్యాలయం కేటాయించిన సిఎంకు ధన్యవాదాలు
– జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉపాధి లేదనేది పూర్తిగా అవాస్తవం
– బీసీలకు రూ.10 వేల కోట్లను ఖర్చు చేసిన ఘనత వైసిపిదే
– నారా లోకేష్ చేస్తున్నది అబద్దాల యాత్ర
– విలేకరుల సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు బి.వై. రామయ్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బిసిలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని వైయస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు, కర్నూలు మేయర్ బి.వై. రామయ్య అన్నారు. శుక్రవారం స్థానిక బిర్లా కాంపౌండ్లోని జిల్లా పార్టీ ఆయన విలేకరులతో మాట్లాడారు. నారా లోకేష్ పాదయాత్రలో చెప్పిందే చెబుతున్నారని, టిడిపి బిసిలకు చేసిందేమీ లేకపోయినా ఏదేదో చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని బి.వై. రామయ్య మండిపడ్డారు. బిసిలు తమ ప్రభుత్వం, టిడిపి ప్రభుత్వంలో ఎంత లబ్ది పొందారో చంద్రబాబు, లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. పనికిరాని ముట్లతో టిడిపి ప్రభుత్వం బిసిలను వంచించినందుకే గత ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారని, అది లోకేష్ గుర్తు పెట్టుకోవలన్నారు. కేవలం ఒక్క బీసీల కోసం రూ.10.60 వేల కోట్ల వైయస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అడ్డదారిలో మంత్రి అయిన లోకేష్ అవివేకి ఇవన్నీ ఎలా తెలుస్తాయన్నారు. బిసిలకే కాదు ఏ వర్గానికి చంద్రబాబు ప్రభుత్వం మేలు చేయలేదన్నారు. లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదు అబద్ధాల యాత్ర అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని కీలక పదవుల్లో అధికశాతం బీసీలు ఉన్నారని, చివరికి లోకేష్ తిరుగుతున్న ఇదే కర్నూలు జిల్లాలో ఒక మంత్రి, మేయర్, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో బీసీలు ఉన్నారనేది లోకేష్ తెలుసుకోవలన్నారు. 14 ఏళ్ళ చంద్రబాబు పాలనలో వాల్మీకులకు తీరని ద్రోహం చేశారని, దానికి భిన్నంగా సిఎం జగన్ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానించి న్యాయం చేస్తున్నారన్నారు.
సిఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎ.పి.ఈ.ఆర్.సి.) ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బి.వై‌ రామయ్య ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మూడు రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే జగన్ శ్రీకారం చుట్టారని, అయితే టిడిపి అడ్డపడుతుందన్నారు. ఎంతో వెనుకబడిన కర్నూలు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేయడం కోసం కర్నూలును న్యాయరాజధానికి ప్రకటించి ఆ దిశగా న్యాయశాఖ కార్యాలయాలన్నీ కర్నూలుకు సిఎం తరలిస్తున్నారన్నారు. హామీ ఇవ్వని కార్యాలయాలు కూడా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమ ప్రాంతంలో వలసలు ఆనవాయితీ
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉపాధి లేదనే లోకేష్ వ్యాఖ్యలను బి.వై. రామయ్య ఖండించారు. అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి వలసలు వెళ్ళడం ఆనవాయితీగా వస్తుందని స్పష్టం చేశారు. వాటిని గత ప్రభుత్వాలు కూడా నివారించలేకపోయనన్నారు. అంతేతప్ప ఉపాధి లేదనేది పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ నెల 26న మంత్రాలయం నియోజకవర్గంలో రైతుల సమావేశంలో లోకేష్ అన్ని అబద్దాలే ఆడరన్నారు. రైతుల కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేశాయనేది రైతులందరికీ తెలుసన్నారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి, బిసి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ ఆచారి, వైసిపి విద్యార్థి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, ఉపాధ్యక్షుడు మణిరెడ్డి, నాయకులు బత్తుల లక్ష్మికాంతయ్య, కురుబ అనిల్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.

About Author