NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తుల వసతుల కల్పనకు ప్రాధాన్యం : రెడ్డివారి చక్రపాణిరెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​: శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు  రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు. పరిపాలనా కార్యాలయములో తమకు కేటాయించిన చాంబర్లో  పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులచాంబర్లో సాంప్రదాయబద్ధంగా గణపతిపూజ, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటానికి పూజాదికాలు నిర్వహించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి వార్ల ఆశీస్సులతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు స్థానిక శాసనసభ్యులు సహకారంతో క్షేత్రాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందన్నారు. పాలకమండలి చైర్మన్ గా సభ్యులుగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి జి.ఎం. విజయలక్ష్మి సుబ్బరాయుడు, శ్రీ ఎ. మురళి, శ్రీ మేరాజోత్ హనుమంతనాయక్ మరియు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ తన్నీరు ధర్మరాజు. శ్రీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి  దేవస్థానం సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో లో పాల్గొన్నారు.

About Author