క్రైస్తవులకు ప్రాధాన్యమివ్వాల్సిందే..
1 min read– లేదంటే … కోర్టుకెళ్తాం..
పల్లెవెలుగువెబ్, విజయవాడ : ఏపీలో నిజమైన క్రైస్తవులకు న్యాయం జరగడంలేదని ఆరోపించారు క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జెరూసలెం ముత్తయ్య. రాజ్యాంగబద్దంగా బీసీ సీ క్రైస్తవులకు న్యాయం జరగడంలేదని, 48 గంటల్లో న్యాయం చేయాలని లేదంటే కోర్టుకెళ్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీ నగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హోంమంత్రి సుచరిత, ఎంపీ సురేష్ నిజమైన క్రైస్తవులు కాదని ఆరోపించిన జెరూసలెం ముత్తయ్య.. తెలంగాణ తరహాలో ఏపీలో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రైస్తవులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎస్సీలంతా క్రైస్తవులు కాదని, క్రైస్తవులంతా ఎస్సీలు కాదని, ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. బిసి.సి లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లుగా అవకాశం ఇవ్వాలని, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత బిషప్ కాటూరు ప్రభుదాస్ మాట్లాడారు.