హెల్త్‌కు ప్రాధాన్యత..
1 min read– కడప ఎస్పీ అన్బు రాజన్
– డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం
పల్లెవెలుగు వెబ్, కడప: నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించారు. అంతేకాక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ల్యాబ్ ఏర్పాటు చేశామని, ఇక్కడ అతి తక్కువ ధరకు నాణ్యమైన, ఖచ్చితత్వంతో కూడిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. క్యాన్సర్ నిర్ధారణ , రోగ నిర్ధారణ, బయో కెమిస్ట్రీ, మోలిక్యులర్ బయాలజీ, ఇతర విభాగాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమం లో ఏ.ఆర్ అదనపు ఎస్.పి రిషికేశవ రెడ్డి, కడప డి.ఎస్.పి బి.సునీల్, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, పోలీసు సంక్షేమ అస్పత్రి వైద్యురాలు డా. సమీరా, ఆర్.ఐ లు మహబూబ్ బాషా, జార్జ్, సోమశేఖర్ నాయక్, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.