ప్రైవేటు బస్సులో రూ. 17 లక్షలు మాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సులో రూ. 17 లక్షలు చోరీకి గురయ్యాయి. బంగారుపాలెం మండలం నందిని ఫుడ్ ప్లాజా వద్ద ఓ ప్రైవేట్ బస్సులో 17 లక్షల రూపాయలు చోరీకి గురైంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ వ్యాపారి వద్ద పనిచేసే ఆది బాబు అనే వ్యక్తి బెంగళూరుకు నగదు తీసుకుని పోతుండగా ఈ చోరీ జరిగింది. అల్పాహారం కోసం బస్సు నందిని ఫుడ్ ప్లాజా వద్ద నిన్నటి రోజు తెల్లవారుజామున ఆగిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆది బాబు నగదును కలిగిన బ్యాగ్‌ను లగేజ్ క్యారియర్‌లో పెట్టి అల్పాహారం కోసం వెళ్లి వచ్చేటప్పటికి మాయమైంది. బాధితుని ఫిర్యాదుతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.