ప్రైవేటు ఆసుపత్రులు.. వివరాలను 10 రోజుల్లో పంపాలి
1 min read
ఏప్రిల్ 10 వరకు స్వచ్చ సర్వేక్షన్ ఫీడ్‌బ్యాక్ గడువు పొడిగింపు
నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సంభవించిన జననాలు, మరణాల వివరాలను పది రోజుల్లోగా నగరపాలక సంస్థకు పంపాలని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. వివరాలను పంపడంలో జాప్యం చేస్తే ఒక్కొక్క జననము, మరణము మీద రూ.2 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, ఆ రుసుమును సంబంధిత ఆసుపత్రి యాజమాన్యమే భరించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఆ రుసుమును యాజమాన్యం ప్రజల నుండి వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే, ఆ ఆసుపత్రి సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓలకు సిఫార్సు చేయడం జరుగుతుందని ప్రజారోగ్య అధికారి హెచ్చరించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ ఫీడ్‌బ్యాక్ ఏప్రిల్ 10 వరకు పొడిగింపు:
దేశవ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో స్వచ్ఛత పనులపై అభిప్రాయాలను సేకరించేందుకు చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ సిటిజన్ ఫీడ్ గడువును ఏప్రిల్ 10 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని ప్రజారోగ్య అధికారి తెలిపారు. ఇంకా ఫీడ్‌బ్యాక్ ఇవ్వని పౌరులు తక్షణమే ఈ లింకు https://sbmurban.org/feedback ద్వారా అభిప్రాయాలను తెలిపి, నగరాన్ని జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సహకరించాలని ప్రజారోగ్య అధికారి కోరారు.