డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదాన్ని గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
1 min read
నలుగురికి గాయాలు పలువురికి తప్పిన ప్రమాదం
ప్రమాద ఘటనా స్థలం పరిశీలించిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్,ఉపరవాణా కమిషనర్ షేక్ కరీం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఉప రవాణా కమిషనరు వారి కార్యాలయము, ఏలూరు జిల్లా, ఏలూరు.సోమవారం తెల్లవారు జామున ఏలూరు జాతీయ రహదారి పై ఆశ్రమం ఆసుపత్రి సమీపములో 49 ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేట్ కాంట్రాక్టు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము వలన ప్రమాదానికి గురైన సంఘటనలో నలుగురుగాయాలపాలు కాగా, మిగిలిన వారు తృటిలో సురక్షితముగా బయటపడ్డారు. ప్రమాద విషయము తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ కె.పి.శివ కిషోర్, ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తమ యొక్క సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశములో తీసుకోవాల్సిన రహదారి భద్రత చర్యలను యుద్ధప్రాదిపతికన చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఈ నెల 6 వ తేదీన చొదిమెళ్ళ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదాన్ని మరువకమునుపే మరో ప్రమాదం జరగడంపై డీటీసీ కరీమ్ స్పందిస్తూ.. జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ రోజు వరకు జిల్లాలో కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 163 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తముగా ఈ రోజునుంచే ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ఉల్లంఘనలకు పాల్పడే కాంట్రాక్ బస్సులపై ప్రత్యేక దృష్టిసారించి కేసులు నమోదు చేయాల్సిందిగా వాహన తనిఖీ అధికారులను అయన ఆదేశించారు.