స్వీయ నిర్భందంలోకి ప్రియాంక గాంధీ !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. తమ కుటుంబంలోకి ఒకరికి, తన సిబ్బందిలో మరొకరికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్టు ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తాను పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. వైద్యలు సలహా మేరకు స్వీయ నిర్భందంలో ఉంటానని, మరికొన్ని రోజుల తర్వాత పరీక్షలు చేయించుకుంటానని తెలిపారు.