ఉర్దూ కాలోగ్రఫీ టెస్టు విజేతలకు బహుమతులు ప్రధానం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నగరంలోని ఉర్దూ అకాడమీ కార్యాలయంలో విద్యార్థులకు ఉర్దూ కాలోగ్రఫీ టెస్టు నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం విద్యార్థులు, 8,9,10వ తరగతి విద్యార్థులు మొత్తం 82 మంది ఈ టెస్టులో పాల్గొన్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు, షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు సూరి మన్సూర్ అలీ ఖాన్ నగదు బహుమతులు అందజేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.1000, రూ.500, రూ.300లు నగదు బహుమతి అందించారు. జూనియర్ విభాగంలో విజయం సాధించిన విద్యార్థులకు రూ.800, రూ.400, రూ.300లు అందజేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డీ ఫరూఖ్ నేతృత్వంలో ఈ టెస్టు ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిందని మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. తమ ప్రభుత్వం ఉర్దూ భాషను ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం డీఎండబ్లూఓ సబియా పర్వీన్ విద్యార్థులను అభినందించి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మహమ్మద్ పీర్, తదితరులు పాల్గొన్నారు.