సమస్యల్లేని..మండల సర్వసభ్య సమావేశం
1 min read
అధికారులకు బయటి వ్యక్తి ప్రశ్నలు
నోరు మెదపని ప్రజా ప్రతినిధులు
తూతూ మంత్రంగా మిడుతూర్ మండల సమావేశం..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలకు ప్రజా ప్రతినిధులు మాత్రమే సమావేశ హాల్లోకి రావాలి కానీ ఇక్కడ మాత్రం బయట వ్యక్తులు సమావేశం హాల్లోకి రావడం ఒక ఆనవాయితీగా మారుతోంది.అంతే కాదు హాల్లో దర్జాగా కుర్చీల్లో కూర్చుని అధికారులకు ప్రశ్నలు వేస్తూ ఉండడం గమనార్హం ఇది ఎక్కడో జరిగింది కాదు నంద్యాల జిల్లా మిడుతూరు మండల సర్వసభ్య సమావేశంలో జరిగింది.శనివారం ఉదయం 11:20 కి ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది.ప్రారంభమైన తర్వాత 12:30 నిమిషాలకే తూతూ మంత్రంగా సమావేశం ముగించారు.గ్రామాల్లో సమస్యలు తాండ విస్తున్నా ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ కూడా నోరు మెదపక పోవడం శోచనీయం.గ్రామాల్లో నీళ్లు వృధా కాకుండా చూసుకోవలసిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాథ్ అన్నారు.గ్రామాల్లో బహుళ ప్రయోజన గోదాములు నిరుపయోగంగా ఉన్నాయి రైతులకు ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగించాలని బయటి వ్యక్తి అన్నారు.గ్రామాల్లో మోటార్లు రిపేర్,త్రాగునీటి గురించి ఏమైనా సమస్యలు ఉంటే అంతే కాకుండా గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేకపోతే నా దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో పి. దశరథ రామయ్య పంచాయితీ కార్యదర్శులతో అన్నారు. జలకనూరులో అంగన్వాడీ కేంద్రం నిర్మాణంలోనే ఉండగా అక్కడే 250 సిమెంట్ బస్తాలు ఉంచారు అవి గడ్డ కట్టిపోయాయని పిల్లలు అన్నం తినేటప్పుడు గాలికి సిమెంట్ వస్తూ ఉండడంతో పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారని సర్పంచ్ కురువ ఎల్లయ్య లేవననెత్తారు.ఏపీఓ జయంతి, ఈఓఆర్డి సంన్న,వ్యవసాయ శాఖ ఏఓ పీరు నాయక్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ టి శ్రీనివాసులు, ఎంఈఓ ఫైజున్నిసా బేగం, ఏఈలు ప్రతాప్ రెడ్డి,క్రాంతి కుమార్,విశ్వనాథ్, భాస్కర్,అంగన్వాడీ సూపర్వైజర్లు వరలక్ష్మి, రేణుకాదేవి,వైస్ ఎంపీపీ నబి రసూల్,సర్పంచులు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
