సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడతాం..
1 min readపాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి/జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి పోలింగ్ కేంద్రాలకు పోలీసు వారిచే కూడా భద్రతా కల్పించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రం ఏర్పాటులో ముఖ్యంగా ఓటర్లకు అనుకూలంగా ఉండే విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్న తమ దృష్టికి తీసుకొని వస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటామని పాణ్యం నియోజకవర్గ ఎన్నికల అధికారి/జాయింట్ కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.అనంతరం రాజకీయ పార్టీ ప్రతినిధులు పలు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి లేవనెత్తిన అంశాలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.సమావేశంలో పాణ్యం మాజీ శాసనసభ్యులు గౌరిచరిత, బిఎస్పీ పార్టీ ప్రతినిధి చిరంజీవి, టిడిపి పార్టీ ప్రతినిధి ఆర్.యశ్వంత్ రెడ్డి, బిజెపి, సిపిఎం పార్టీ ప్రతినిధులు, కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.