PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోర్టులో ప్ర‌త్య‌క్ష‌మైన నిర్మాత బండ్ల గ‌ణేష్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ నిర్మాత‌, సినీ న‌టుడు బండ్ల గ‌ణేష్ ఒంగోలు కోర్టులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు లోని జిల్లా సివిల్ అండ్ సెషన్స్ కోర్టుకి సోమవారం బండ్ల గణేష్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి బండ్ల గణేష్ ఇచ్చిన కోటి రూపాయల చెక్.. బౌన్స్ అవ్వడంతో ఆయన కోర్టుని ఆశ్రయించాడు. ఈ విషయమై సోమ‌వారం త‌న లాయ‌ర్ల‌తో క‌లిసి బండ్ల గ‌ణేష్ కోర్టుకు హాజ‌ర‌య్యారు.

                           

About Author