PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత

1 min read

పల్లెవెలుగువెబ్: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు దానిని వదిలేసి సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. బాబాయి శ్రీనివాసరావు ప్రోత్సాహంతో దర్శకుడు మధుసూదనరావు వద్ద 1969లో సహాయ దర్శకుడిగా చేరారు.

                   

About Author