PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైన్స్ విజ్ఞాన అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యపడుతుంది

1 min read

– నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ మరియు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి సైన్స్ క్విజ్ ఛాంపియన్షిప్ పోటీలలో భాగంగా జరిగిన జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ ఛాంపియన్షిప్ పోటీలను నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, ఎస్ వి విజయ మనోహరి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో కూడిన సైన్స్ పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి మాట్లాడుతూ ఉన్నత ఉద్యోగ అవకాశాల కొరకు, కాంపిటీషన్ పరీక్షలకు అకాడమిక్ సైన్స్ తో పాటు జనరల్ సైన్స్ పైన కూడా దృష్టి సారించాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 117 మాజీ గవర్నర్, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ సైన్స్ క్విజ్ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నుండి పాల్గొంటున్నారని అందులో కర్నూల్ నుండి 1200 మంది జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో పాల్గొనడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలలో నుండి జూనియర్స్, సీనియర్స్ విభాగాల నుండి ప్రధమ, ద్వితీయ స్థానాలను పొందిన వారిని మల్టిపుల్ లెవెల్, మల్టిపుల్ లెవెల్ లో గెలుపొందిన వారిని అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని, తదుపరి పోటీలన్నీ అంతర్జాలంలో నిర్వహించబడతాయి అన్నారు. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రంగమ్మ ఆధ్వర్యంలో 35 మంది సైన్స్ టీచర్ల టీం సమక్షంలో విజేతల ఎంపిక జరిగింది. జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండే సైన్స్ విజ్ఞానం పై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. అనంతరం బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు డిఎస్పి మహేష్ సమక్షంలో మొత్తం అన్ని విభాగాల నుండి 40 మందికి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తో పాటు నగదు, సర్టిఫికెట్లను, మోమెంటులను బహుమతిని అందజేశారు. కర్నూలు మండల విద్యాధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ విద్యార్థుల్లో సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు సురేష్, జిల్లా జన విజ్ఞాన వేదిక జనరల్ సెక్రెటరీ డాక్టర్ బడే సాబ్, ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author